267views
తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని శృంగేరి పీఠంలోని కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం , శివలింగాని కి అర్చనలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి కి సోదరుడైన శంభేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశిష్టత పై ప్రవచనాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుమారు 140 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శృంగేరి పీఠం ట్రష్టి అచ్చయ్య శాస్త్రి మాట్లాడుతూ శివ కేశవులు కొలువైయున్న ఈఆలయం ఎంతో పురాతనమైనది విశిష్టత కలిగిందని అన్నారు. కార్తీకమాసంతో పాటు ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహించి భక్తులకు ఇతోదధికంగా సేవలందిస్తున్నామన్నారు.





