NewsSeva

మూగజీవుల పట్ల మమతను చాటిన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త

567views

త మూడు రోజులుగా కర్నూలు జిల్లా నంద్యాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనమే కాదు జంతు జీవనం కూడా స్తంభించింది. కడుపుతో ఉన్న ఒక వానరం ఒక బిడ్డకు జన్మనిచ్చి, సరియైన ఆహారం లేక అపస్మారక స్థితిలో పడిఉంటే ధర్మ జాగరణ కర్నూలు జిల్లా సంస్కృతీ ప్రముఖ్ శ్రీ పుల్లయ్య మానవత్వంతో స్పందించి పశువైద్య సహాయ సంచాలకుల కార్యలయం నుండి వైద్యుణ్ణి పిలిపించి, దానికి చికిత్స చేయించి తల్లికి ఆహారం, చిన్న పిల్లకు పాలు అందించి తల్లి, పిల్ల రెండిటి ప్రాణాలు కాపాడారు.

ఈ సంఘటన స్థానిక సాయిబాబా నగర్ లోని శ్రీశైల స్కూలు లో జరిగింది. ఇందులో కొందరు ఉపాధ్యాయులు కూడా సహకరించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. సాటి మనుషులు చావు బతుకుల్లో ఉంటేనే సాయం చేయకుండా సెల్ఫీలు, వీడియోలు తీసుకునే నేటికాలంలో ఇలాంటి సేవ చూపరులను ఆలోచింప చేసింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.