News

రైతులకు అండగా భారతీయ కిసాన్ సంఘ్

182views

రైతు సమస్యల పరిష్కారానికి భారతీయ కిసాన్ సంఘ్ కృషి చేస్తుందని, వారికి అండగా ఉంటుందని సంఘ్ జాతీయ నాయకుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం సత్యనారాయణపురంలోని సరస్వతి శిశు విద్యా మందిరం పాఠశాలలో నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పంటల బీమా, కాలువలు, ప్రాజెక్టుల నిర్మాణంలో సహకారం అందిస్తామని చెప్పారు. సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు పరిమి రాఘవులు మాట్లా డుతూ…. అన్నదాతల ఐక్యతకు సంఘ్ కృషి చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పత్తిరాజు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి సహదేవరెడ్డి
సమావేశంలో సంఘ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి సహదేవరెడ్డి (కడప జిల్లా), ఉపాధ్యక్షులు ముత్యాల రాజేంద్రప్రసాద్ (డా. అంబేడ్కర్ కోన సీమ జిల్లా), కారుమంచి బాలసుధారాణి (బాపట్ల జిల్లా), అనుముల గాంధీ(ఎన్టీఆర్ జిల్లా), ప్రధాన కార్యదర్శి కవులూరి పత్తి రాజు (ఏలూరు జిల్లా), కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి (నంద్యాల జిల్లా), కోశాధికారిగా వల్లభనేని ఆశాకిరణ్(కృష్ణా జిల్లా) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పైడికొండల శివాజీ, రాజిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్, రాఘవులు, శ్రీరాం బాబు, చంద్రశేఖర్, కొండబాబులు ఎంపికయ్యారు.