News

ఆలయ భూములను స్వాధీనం చేసుకున్న వక్ఫ్‌ బోర్డు

314views

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో దేవాలయం సమీపంలోని 40 ఎకరాల స్థలాన్ని వక్ఫ్‌ బోర్డు స్వాఽధీనం చేసుకోవడంతో వివాదం నెలకొంది. కానిఫ్‌నాథ్‌ ఆలయం సమీపంలో ఉన్న ఈ స్థలం దర్గాకి చెందినదని పేర్కొంటూ బోర్డు పెట్టింది. ఇందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను పేర్కొంది. ఈ స్థలాన్ని 2005లో వక్ఫ్‌ చట్టం కింద రిజిస్టర్‌ చేశారు. అప్పటి నుంచి చట్టపరమైన వివాదం నడుస్తోంది. ఈ చర్యను ఆలయ ట్రస్టీ శ్రీహరి అంబేకర్‌ ఖండించారు. బ్రిటిష్‌ కాలం ముందు నుంచే ఆ స్థలం ఆలయ పరిధిలో ఉందని, ఇందుకు సంబంధించిన పత్రాలను కోర్టు కూడా అంగీకరించిందని తెలిపారు. ఆలయ ట్రస్టీలకు సమాచారం ఇవ్వకుండానే, తగిన నిబంధనలను పాటించకుండానే ఈ స్థలాన్ని వక్ఫ్‌ చట్టం ప్రకారం రిజిస్టర్‌ చేశారన్నారు.