News

ఆరెస్సెస్ రహిత భారత్ ను సృష్టిస్తాం : కనిమొళి

313views

డీఎంకే ఎంపీ కమనిమొళి ఆరెస్సెస్, బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ లేని, బీజేపీ లేని భారత్ ను సృష్టిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. మూడు రోజుల క్రితం తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు.ఆరెస్సెస్ దేశంలో ద్వేషపూరిత రాజకీయాలు చేస్తోందంటూ నిరాధార ఆరోపణలకు దిగారు. ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా… ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం నోరు మెదపడం లేదు. ఓ వైపు కాంగ్రెస్ కార్యకర్తల కేరింతల మధ్య కనిమోళి వారిని ఉర్రూతలూగిస్తూ సంఘ్ పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారు. ఆరెస్సెస్ రాజకీయాలకు చాలా దూరంగా వుంటుందని తెలిసి కూడా… కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని హిందువులు మండిపడుతున్నారు.

ఆరెస్సెస్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని కనిమొళి చూస్తున్నారని స్పష్టంగా ద్యోతకమవుతూనే వుంది. హిందూ ధర్మ పరిరక్షణకు ఆరెస్సెస్ చేసిన కృషి ఏంటని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ హిందువుల కోసం ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రశ్నలను చూస్తుంటే కచ్చితంగా దురుద్దేశంతోనే సంఘ్ ను రాజకీయాల్లోకి లాగుతున్నారని, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమైపోతోంది. సంఘ్ ఈ విజయ దశమికి శతాబ్ది లోకి ప్రవేశించింది. ఈ దశాబ్ద కాలంలో సంఘ్ హిందూ సమాజానికి, హిందూ సమాజ ఐక్యతకు ఏం చేసిందో హిందూ సమాజానికి బాగా తెలుసు.