
కుటుంబ విలువలు పెంచే రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అనంతపురంలోని స్థానిక పవర్ ఆఫీసు వద్ద మహర్షి వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణి, అమిలి నేని సురేంద్రబాబు, ఎంఎస్‌రాజు, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సెక్రటరీ పోలా భాస్కర్, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర సంచాలకులు మల్లికార్జున, కలెక్టర్ వినోద్‌కుమార్ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గుత్తిరోడ్డులోని బల్లా కన్వెన్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.





