News

పాక్‌ ఈ ఏడాదిలో 2050సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది – ఐరాస మానవ హక్కుల మండలిలో సాక్ష్యాలు చూపించిన భారత్

697views

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ సాక్ష్యాలతో బుద్ధి చెప్పింది. ఈ ఏడాదిలో 2050సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ ఘటనల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సరిహద్దులో ఉన్న ఉగ్రవాదుల సాయంతో పాక్‌ దళాలు పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది. భారత పౌరులు, సరిహద్దులో ఉన్న వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఇలా అడ్డదారులు తొక్కడం పాక్‌ మానేయాలి. ఈ ఏడాది పాక్‌ 2050సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఇప్పటికే ఎన్నో సార్లు పాక్‌కు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోతోంది. భారత్‌ చాలా సంయమనం పాటించింది. ఇక మీదట దీటుగా సమాధానం చెబుతుంది’ అని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.