
సేవాభారతి పిలుపు మేరకు 15-9-2019 నుండి 22-9-2019 వరకు వారం రోజులు పాటు నిర్వహించే స్వచ్చ భారత్ అభియాన్లో భాగంగా పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ, జల సంరక్షణ, నీటిని ఒడిసి పట్టడం పై ప్రజలలో అవగాహన కల్పించడం తోపాటు “గుడ్డ సంచుల వాడండి – ప్లాస్టిక్ సంచులువాడవద్దు” అనే పిలుపు తో దేశ వ్యాప్తంగా “పర్యావరణ సేవా సప్తాహం” ప్రారంభమైంది.
అందులో భాగంగా సంఘమిత్ర ఆద్వర్యంలో చిన్నారుల్లో సేవా దృక్పథం, స్వచ్చత భావన అలవర్చడం కొరకు “పర్యావరణ సేవా సప్తాహం” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

అందులో బాగంగా ఈ రోజు ప్రధమనంది లో ,YSR నగర్ లో, బుడగ జంగం కాలనీలలో పరిసరాలను సంఘమిత్ర విద్యార్ధులు, నంద్యాల నగరానికి చెందిన కొందరు సామాజిక కార్యకర్తలు శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఆవాస్ ప్రముఖ్ శ్రీ గంగాధర్, సంఘమిత్ర విద్యార్థులు,అభ్యాసికల విద్యార్థులు, సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ. శ్రీనివాస్ పాండే, సేవా భారతి రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ మనోహర్ కమిటీ సభ్యులు శ్రీ వివి రమణయ్య గారు శ్రీ ఈ వెంకటయ్య గారితో పాటు కాలనీలలో ప్రజలు పాల్గొన్నారు.





