
268views
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2027లో జరిగే పుష్కరాల నాటికి కోటిలింగాల ఘాట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కోటిలింగాల ఘాట్‌ను, అదే ప్రాంతంతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 పుష్కరాలకు కోటిలింగాల ఘాట్‌ను విస్తరించి అభివృద్ధి చేశారని, రానున్న పుష్కరాలకు ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా అన్నివిధాల అభివృద్ధి చేయడంతో పాటు ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని అనుకుని ఉన్న ఘాట్‌ను భక్తుల తాకిడికి అనుగుణంగా తర్చిదిద్దుతామన్నారు. అందుకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. కోటిలింగాల ఘాట్‌లో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని అఽధికారులను ఆదేశించారు. అలాగే 40,41 డివిజన్లలో సీసీ రోడ్లు, కల్వర్టు నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు.





