News

అక్రమంగా తరలిస్తున్న 50 గోవుల స్వాధీనం

357views

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం లోని హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాదుకు లారీలో అక్రమంగా తరలి స్తున్న 50 గోవులను ఎన్టీ ఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం పోలీసులు అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎస్. శ్రీను తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెనుగొలను వద్ద అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే లారీని స్వాధీనం చేసుకొని ఆవులను నెమలి వేణుగోపాలస్వామి ఆలయం లోని గోశాలలో ఉంచామని పేర్కొన్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నర్సింగ్ తండాకు చెందిన డ్రైవర్ బాణావత్ రమేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.