News

మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం

205views

మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. వడ్డీలేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ఈ ద్వీపదేశంతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. చైనా అనుకూలంగా వ్యవహరించే ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతి న్నాయి. ముయిజ్జు ఒత్తిడి చేయడంతో ఆ దేశంలోని సైనిక బృందాన్ని భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయినా ఆ దేశానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంది. గతంలో కరోనా, ఇతర సంక్షోభ సమయాల్లోనూ ఉదారంగా సాయం చేసింది. భారత్ అందించిన ఆర్థిక సాయంపై మాల్దీ వుల విదేశాంగశాఖ మంత్రి మూసా జమీర్ స్పందిం చారు. భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.