ArticlesNews

దాంపత్య జీవనం మన బలం

335views

మనది ఋషుల భూమి, మనదైన జీవన విధానం వేల సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగిపోవడానికి మన ఋషులు మనకందించిన సంస్కారాలే కారణం. ఆదిఋషి వశిష్ఠుడు, వారి ధర్మపత్ని అరుంధతి వీరు ఋషిదంపతులు. దాంపత్య ధర్మం వీరి ద్వారా ఉపదేశింపబడిరది. దీన్ని ఆదర్శవంతంగా ఆచరించారు సీతారాములు. వివాహం ఒక సంస్కారం, దాంపత్యం ఆదర్శవంత మైనది. సృష్టి క్రతువును సదాచారంతో నిర్వహించేం దుకు దాంపత్యం ఒక సాధనం.భారతీయ ధర్మంలో స్త్రీ పురుషులు సమానం. అర్థనారీశ్వర తత్త్వం మనకు ఆ విషయమే తెలియజేస్తుంది.

శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకొన్నాడు. పాల సముద్రంలో శేషతల్పముపై నిదురించే విష్ణువు ధర్మాచరణలో నిమగ్నమై ఉన్నాడు. కనుకనే లక్ష్మి పాదాల వద్దకు చేరి సేవలందిస్తుంది. ధర్మాచారణ చేస్తే సంపద అదే వస్తుందన్నమాట.అనుసూయ, అత్రి మహర్షులది ఆదర్శ దాంపత్యం.‘సూర్యుడి నుంచి వెలుగును వేరు చేయలేనట్లే సీతను నానుండి ఎవరూ వేరు చేయలేరు’ అంటాడు శ్రీరాముడు. పరస్పర విరుద్ధమైన ధర్మార్థ కామాలను సమన్వయం చేయగలిగిన శక్తి భార్యకే ఉందని మహాభారతం చెబుతుంది. 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు సంసార జీవితం సాగించడం భారతదేశంలో దంపతులకు చాలా సహజంగా కనిపించే విషయం. ఇది విదేశాల్లో కనపడదు. దంపతులు ఆహార నియమాలను విష్ణుపురాణం వివరించింది.అన్యోన్య దాంపత్యానికి పార్వతీపరమేశ్వరులే ఆదర్శం. వారు ఆది దంపతులు, ఆదర్శ దంపతులు.

‘అందుకే నేను చెప్పినట్లే నడుచుకోవాలి, నాకు కావాల్సిందే చేయాలి’ అనకుండా ఎవరి ఆలోచనలు, భావాలను వారు పరస్పరం అభిమానించి ఆదరించి, ఆచరణ కందివచ్చేలా చేసుకుంటూ సాగడమే నిజమై ప్రేమ అంటారు స్వామి వివేకానంద. అదే మన బలమవు తుంది. కుటుంబ జీవానాన్ని బలోపేతం చేస్తుంది.