News

దర్శనమిచ్చిన బద్రీనాథుడు

1kviews

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. దీంతో చార్‌ధామ్‌ యాత్ర అధికారికంగా ప్రారంభమైనట్లయింది. బద్రీనాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకోగానే ఆలయంలోకి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని లెక్క చేయకుండా భారీగా తరలి వచ్చారు. కేదార్‌నాథ్‌, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారమే తెరిచారు.