News

రేపటి నుంచి బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు

311views

వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మంగళవారం నుంచి జగద్గురు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు జరగనున్నాయి. ఆయన క్రీ.శ.1693 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ నెల 14 నుం చి 19 వరకు ఆరు రోజుల పాటు నిర్వహి స్తారు. ఈ నెల 17న వైశాఖ శుద్ధ దశమి నాడు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. 18న బ్రహ్మరథోత్సవం, 19న మహాప్రసాద విని యోగం ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల తోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహా రాష్ట్రల నుంచి భారీగా భక్తులు, మాలధారులు తరలిరానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మఠం ఫిట్పర్సన్ సి.శంకరబాలాజి తెలిపారు.