
276views
తమిళనాడు రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతిని మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. శ్రీరామనవమి సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి కన్యాకుమారి వరకు రామనవమి యాత్ర(నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ యాత్ర ట్రస్ట్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.





