
265views
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరు గ్రామ సమీపంలో గోవధకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రొద్దం ఎస్‌ఐ బాషావలి తెలిపారు. అందిన ముందస్తు సమాచారంతో బుధవారం సాయంత్రం చెరుకూరు శివారులో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో పశువును కోస్తున్న నయాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు వివరించారు.





