News

టిక్… టిక్… టిక్.. కేంద్రం చర్యలతో కాశ్మీర్లో హై టెన్షన్. ఇప్పటికైనా కాశ్మీర్ కుంపటి ఆరనుందా? కథ కొలిక్కి రానుందా?

681views

మ్మూ కాశ్మీర్ లో రైల్వే అధికారులకు సూచనలూ జాగ్రత్తలూ చెప్తూ సీనియర్ ఆర్.పి.ఎఫ్ అధికారులు జీవో జారీ చేశారు. కనీసం 4 నెలలకు సరిపోను ఆహారపదార్ధాలు, 7 రోజులకు సరిపోను తాగునీరూ నిల్వ చేసుకోవాలని, అలాగే కుటుంబాలను జమ్మూ కాశ్మీర్ బయటకు పంపాలని, అమర్నాధ్ యాత్ర కు వచ్చినవారిని ఎట్టిపరిస్థితుల్లో వెనక్కు పంపేయాలని, ఖాళీగా ఉన్న రైలు పెట్టెలకు తాళాలు వేయాలని, గుంపుగా ఉన్నచోటకు వెళ్ళకూడదు అలాగే గుంపులను కాలనీలలోకి రానివ్వకూడదని ఆజ్ఞాపిస్తూ,
ఉద్యోగులందరి సెలవులు రద్దుచేస్తూ, ఆల్రెడీ సెలవుల్లో ఉన్నవారిని అత్యవసరంగా విధుల్లో చేరమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

సో… దీంతో కాశ్మీర్లో ఏదో జరుగబోతోందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఒకవైపు కేంద్రం ఆర్టికల్ 370, 35A లను రద్దు చేయాలనే గట్టి పట్టుదలతో ఉందన్న వార్తలు వస్తున్నాయి. మరో వైపు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్లో అతి పెద్ద ప్రేలుడుకు వ్యూహం పన్నుతున్నాయన్న వార్తలు కూడా ఉన్నాయి. రైల్వే ఉన్నతాధికారుల ఉత్తర్వులు కూడా ఈ ఊహాగానాలకు ఊతం ఇస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో కల్లోల కాశ్మీరం కుదుట పడితే అంతే చాలని, దేశభక్తులు , జాతీయవాదులు సంతోషపడుతుంటే, కేంద్రం చర్యలతో దశాబ్దాలుగా తాము నడిపిస్తూ వచ్చిన పాకిస్థాన్ అనుకూల దుకాణాలు ఎక్కడ బంద్ అయిపోతాయోనని విభజన వాద పార్టీలు, మూకలు, గడ గడ వణికి చస్తున్నారు. ఇంతకీ ఏమి జరుగుతుందో చూద్దాం.