News

పాకిస్థాన్ లో ఇళ్లపై కుప్పకూలిన ఆ దేశ ఆర్మీ విమానం

773views

పాకిస్థాన్ లో ఓ విమానం కుప్పకూలిపోయింది. అది కూడా జనావాసాలపై..! ఈ దుర్ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కూలిన విమానం పాకిస్థాన్ ఆర్మీకి చెందినదిగా తెలుస్తోంది.

మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో విమానం ఇళ్లపై కూలిపోయింది. అయిదు మంది విమాన సిబ్బంది , 12 మంది పౌరులు మరణించారు. గాయపడిన 12 మందిని దగ్గర్లోని అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని పాక్‌ ఆర్మీ ట్రైనింగ్‌ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో ఆ చుట్టపక్కల పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి.