News

ప్రసాదంలో విషం కలిపి హిందువులను చంపాలనుకున్నాం – పట్టుబడ్డ ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడి.

645views

తీవ్రవాద కార్యకలాపాలు చేయడంతోపాటు ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో గత జనవరిలో ముబ్రా, ఔరంగాబాద్‌కు ప్రాంతాల్లో ఉమ్మాత్ ఏ మహ్మదీయ సంస్థకు చెందిన పది మంది అనుమానితులను ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వారిని విచారణ జరిపారు. విచారణలో తీవ్రవాదులు ఏం చేశారనే విషయాలను బయటకు తీశారు. వారు చెప్పిన వివరాలు విని పోలీసులు షాకయ్యారు.

ముంబాయికి సమీపంలోని ముబ్రా ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన అతిపురాతనమైన ముబ్రెశ్వర్ ఆలయం ఉంది. ఇక్కడికి రోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులను చంపేందుకు తీవ్రవాదులు కుట్రలు చేశారు. మహా ప్రసాదంలో విషం కలిపి సుమారు 400 మంది భక్తులను చంపాలని ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడ తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాంబులు పేల్చడంతో పాటు ఇతర తీవ్రవాద కార్యకలాపాలపై కూడ శిక్షణ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ నేఫథ్యంలోనే వారిపై కేసులు నమోదు చేసిన ఏటిఎస్ గత వారం ముంబై ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ ధాఖలు చేశారు. చార్జీషీటులో పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.

అరెస్ట్ చేసిన తీవ్రవాదులు జాకిర్ నాయక్ ప్రసంగాలతో తీవ్రవాదం వైపు ఆకర్షితులైనట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే జకీర్ నాయక్ ప్రసంగాల వీడియోలను సైతం ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరు బాంబులు పేల్చడంతోపాటు దేవాలయంలోని ఇచ్చే మహా ప్రసాదంలో విషం కలిపి భక్తులను మట్టుపెట్టేందుకు శిక్షణ కూడ తీసుకున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే ముబ్రా ప్రాంతలో బాంబులను పేల్చి పరీక్షించారని తెలిపారు.