News

పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్‌ బిల్లు పాస్ బాస్.

680views

రెండవ సారి త్రిబుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్ బిల్లు మతానికి సంబంధించింది కాదని, ఇది దేశంలోని ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

అయితే బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.వ్యతిరేకంగా 82 మంది ఓటు వేశారు.

మరోవైపు ఇప్పటి వరకు ఇలాంటీ చట్టాలు పాకిస్థాన్, మలేషియాతోపాటు మొత్తం 21 ముస్లిం దేశాల్లో అమల్లో ఉందని వెల్లడించారు. మరి భారత దేశంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయకూడదో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని కోరారు. దీని ద్వార మహిళల హక్కులు ,సాధికారిత సాధ్యమవుతుందని చెప్పారు.కాగా త్రిబుల్ బిల్లును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీజేపీ లోక్‌సభలో మాత్రం నెగ్గించుకుంది. కాని రాజ్యసభలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.