
244views
అవును మీరు చదివింది నిజమే. ఒక్క నిమ్మకాయ అక్షరాల రూ.35 వేలు పలికింది. వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరలు పెరుగుతాయని తెలుసు. పదో పాతికో పెరుగుతాయి కానీ.. వేలల్లో పెరగడమేంటి అనుకుంటున్నారా. నిజానికి ఆ ధర నిమ్మకాయది కాదు. నిమ్మకాయ వేలం వేస్తే పలికిన ధర. చెన్నైలోని ఇరోడ్ జిల్లా శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో ఈ వేలం జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారికి నిమ్మకాయలు, పండ్లతో రెండ్రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు జరిపారు. అనంతరం ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం.. పూజలందుకున్న పదార్థాలను వేలం వేశారు. వేలంలో 15 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇరోడ్‌కి చెందిన ఓ భక్తుడు నిమ్మకాయను వేలంపాటలో రూ.35 వేలకు దక్కించుకున్నాడు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పీఠాధిపతి ముందు ఉంచి పూజ నిర్వహించి నిమ్మకాయను దక్కించుకున్న భక్తుడికి అందజేశారు.





