News

రెండోసారి పాక్‌ అధ్యక్షుడిగా జర్దారీ

242views

పాకిస్థాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) సహ ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 68 ఏళ్ల జర్దారీ.. విపక్ష సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌(ఎస్‌ఐసీ) సమర్థించిన మహమ్మద్‌ ఖాన్‌ అచక్‌జాయ్‌ (75)పై విజయం సాధించారు. అధికార పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), పీపీపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జర్దారీకి జాతీయ అసెంబ్లీ, ప్రావిన్సుల్లో 229 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 109 ఓట్లు వచ్చాయి. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న జర్దారీ అధ్యక్ష పదవికి ఎన్నికవ్వడం ఇది రెండో సారి. 2008-13 మధ్య కాలంలోనూ ఈ బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు రెండు సార్లు అధ్యక్ష పదవిని నిర్వహించనున్న తొలి పౌర అధ్యక్షుడు కూడా.