News

ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణ ప్రారంభం, పోటెత్తిన భవానీలు

219views

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. భవానీలు గిరిప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

భవానీలు ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన అనంతరం మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ తర్వాత హోమగుండాల్లో నేతి కొబ్బరికాయను సమర్పించి గురుస్వామి వద్ద మాల తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల ఏడో తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది దీక్షాధారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.