News

అయోధ్య రాముడి విగ్రహం ఇంకా ఖరారు కాలేదన్న ట్రస్టు

323views

అయోధ్యలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మంగళవారం స్పష్టం చేసింది. అంతకుముందు అయోధ్యలో ప్రతిష్ఠకు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ తయారుచేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సైతం శిల్పిని అభినందించారు. ఈ వార్తల నేపథ్యంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు స్పందించి పై వివరణ ఇచ్చింది.