News

‘అలా జరుగుతుందని ఎవరూ అనుకోని ఉండరు’: రామ మందిరం నిర్మాణంపై అమిత్ షా

294views

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 69వ జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడం పరస్పర విరుద్ధమైనవి కావని అన్నారు. గతంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించవచ్చని ఎవరూ నమ్మలేదని తెలిపారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక సందర్భాల్లో పోరాడిందని అమిత్ షా అన్నారు. జ్ఞానం, వినయం, ఐక్యత అనే ప్రాథమిక మంత్రాన్ని ఓపికగా అలవర్చుకోవడం ద్వారా మార్గం సుగమం చేసిందని చెప్పారు. దేశం ముందు, విద్యారంగంలో, దేశ సరిహద్దుల్లో ఎదురయ్యే ప్రతి సవాలును విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎదుర్కొన్నారని కొనియాడారు. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు.

VIDEO COURTESY:ANI