
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూమరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ అతడు విడుదల చేసిన వీడియో తో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు.
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నాలుగున మొదలైన ఈ సమావేశాలు.. డిసెంబర్ 22 వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో డిసెంబర్ 13లోగా పార్లమెంట్‌పై దాడికి పాల్పడతామని పన్నూ చేసిన బెదిరింపులను.. భద్రతా సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి.
‘పార్లమెంట్ ప్రాంగణం మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశాం. సమావేశాలు జరుగుతున్నప్పుడు.. మేం అత్యంత అప్రమత్తంగా ఉంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అనుమతించం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని భద్రతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అలాగే దిల్లీవ్యాప్తంగా కూడా భద్రతను పెంచినట్లు తెలిపారు.





