ArticlesNews

ఉత్తమ పర్యాటక గ్రామంగా ధోర్డో ఎందుకు ఎంపికైంది ?

169views

గుజరాత్ లోని ధోర్డో కచ్ ఎడారిలో పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న చిట్టచివరి గ్రామం ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యూటిఓ) అక్టోబరు 10వ తేదీన గుజరాత్లోని కచ్ జిల్లాలో గల ధోర్డోను ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది. ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందిన ధోర్డో గ్రామాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ముఖ్యమంత్రిగా తన పాలనాకాలంలో గుజరాత్లోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యానికి శ్రీకారం చుట్టిన మోదీకి ఇది ఎంతో హర్షాన్ని కలిగించే విషయం అని చెప్పడం అతిశయోక్తి కాబోదు. గుజరాత్ లో నీటమునిగిన ద్వారక అవశేషాలు, సోమనాధ్, ద్వారకాధీశుని ఆలయాలు, మధేరా సూర్య దేవాలయం, డూంగర్ దత్తాత్రేయుని ఆలయంతో పాటు ఆధునికతకు అద్దంపట్టే సైన్స్ సిటి వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కచ్ ప్రాంతం ఒక ఎత్తు.

గుజరాత్ పర్యటనకు వెళ్ళినపుడు, కచ్ ప్రాంతాన్ని చూడకపోతే మీ పర్యాటక అనుభవం పరిపూర్ణం కాదు అని చెబుతూ ఉంటారు. ‘కచ్ సహీ దేఖాతో కుచ్ సహీ దేఖా’ అన్న నివాదం అలా పుట్టిందే. ఎందుకంటే, అక్కడ ప్రకృతి తన అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎడారి ప్రాంతమే కదా అని భావించి నిర్లక్ష్యం చేయడానికి లేదు. ప్రకృతి దేని అందాన్ని దానికి ప్రసాదిస్తుంది. నిజానికి ఏడారి అనగానే వెంటనే మన కళ్ళముందు కదిలేని ఇసుకతిన్నెలు. కానీ కచ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అవి పెద్దగా దర్శనమివ్వవు. టెక్టోనిక్ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతం సముద్రంలో నుంచి బయిటపడిందట.

ప్రత్యేకించి రుతుపవనాల సమయంలో వర్షపాతం సందర్భంగా ఈ ప్రాంతంలో సముద్రపు నీరు వరదలై పారుతుంది. చలికాలం ప్రవేశించిన వాటి నుంచి వాన నీరు ఆవిరైపోయి ఆ ప్రాంతం ఉష్ణ మండల ఉప్పు ఎడారిగా మారిపోతుంది. మంచా అని భ్రమించేట్టుగా ఒక పెద్ద తెల్లని ఉప్పు పొర పరిచినట్టుగా కనిపిస్తుంది. చంద్రుడు ప్రకాశించే రాత్రుల్లో చంద్రుడు భూమి పైకి దిగి వచ్చాడా అన్న అనుభూతిని కలిగిస్తుంది.

ఉప్పు మండల ఎడారిగా ఉన్న ప్రాంతంలో కూడా ఇంత సౌందర్యం ఉంటుందని ఊహించలేం! 2006 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో నరేంద్ర మోదీ సరిహద్దుల్లోని ఈ చివరి గ్రామాన్ని తొలి గ్రామంగా పరివర్తన చేయాలని భావించారు. అయిదు సంవత్సరాల క్రితం భూకంపానికి గుర్తు పట్టలేనంతగా ధ్వంసం అయిన ఈ ప్రాంతం రూపురేఖలు మార్చాలని కలలు గన్నారు. కచ్ లో విలాసవంతమైన అతి పెద్ద టెంట్ సిటీని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో పరిశీలించారు. కాని, ఆ ప్రాంతంలో అంత భారీ మానవ నిర్మిత మౌలిక వసతి నిర్మాణం సాధ్యం కాలేదు. ఆయా రంగాలకు చెందిన నిపుణులను కూడా దీనిని సాకారం చేసేందుకు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రపంచ శ్రేణి పర్యాటక కార్యకలాపాలతో కూడిన సదుపాయం ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించారు. కచ్ ప్రాంతంలో బన్నీ పచ్చికబయళ్ళు గల రక్షిత ప్రాంతంలో రాత్రి 8 గంటల తర్వాత తళుకు తళుకు మంటూ గాల్లో తిరుగుతూ కనిపించే చిన్న, పెద్ద దీపాలు నృత్యం చేస్తున్నట్టు ఉంటుంది. ఇవి మెర్క్యూరీ దీపాల్లా మెరుస్తూ ఉంటాయి. కాగా, చిత్తడి నేలల్లో జీవపదార్ధం కుళ్ళినప్పుడు ఉత్పత్తి అయ్యే మెథేన్ కారణంగానే ఇవి ఇలా మెరుస్తూ కనిపిస్తాయని కొందరు శాస్త్రవేత్తల భావన.

మట్టితో నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్న అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు కొత్తగా వచ్చినవారికి అతిథ్యం ఇవ్వడంలో స్థానిక ప్రజలకు శిక్షణ ఇచ్చారు. ఫలితంగా ఒకప్పుడు జీవం లేనిదిగా కనిపించే ధోర్టోలో అనేక హెూటళ్లు, ఇతర వసతులు ఏర్పడి, పర్యాటక పరిశ్రమ ఆవిర్భవించింది. కాని, ఈ చర్యలేవీ సరిపోలేదు. తొలుత గుజరాత్ సిఎంగాను, ఆ తర్వాత పిఎంగాను నరేంద్ర మోదీ మీడియాలో ధోర్డో గురించిన వార్తలు ప్రముఖంగా రావాలని భావించి ‘రాన్ ఉత్సవ్’ నిర్వహణను అన్నిరకాలుగాను ప్రోత్సహించారు. శతాబ్దాల చరిత్ర గల కచ్ కు చెందిన మట్టి, వెండి, తోలు హస్తకళా ఉత్పత్తులను ప్రోత్సహించారు. ఇది కచ్ ఆర్ధిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందించింది. దాంతో నేడు ధోర్డో గ్రామం పెద్ద పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రతీ ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. స్థానిక ప్రజలకు కోట్లాది రూపాయల వ్యాపారావకాశం అందుబాటులో ఉంది. పిఎం నరేంద్ర మోదీ ఎంతో శ్రమకోర్చి తీసుకున్న చర్యల కారణంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ధోర్డోను ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ధోర్డో గ్రామానికి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ, ప్రధానమంత్రి 2009, 2016 సంవత్సరంలో తాను ఆ గ్రామాన్ని సందర్శించినప్పటి చిత్రాలను ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

-న్యూ ఇండియా సమాచారం నుండి