News

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

180views

కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన మీడియాకు వెల్లడించారు.

►అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం
►టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థల కేటాయించే ప్రాంతాలలో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం
►15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం
►టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు
►తిరుపతి రాం నగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు
►టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850
►తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగింపు, 3.40 లక్షలు కేటాయింపు
►మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయింపు
►రేణిగుంట రోడ్డు నుంచి తిరుచానూరు వరకు 3.11 లక్షలతో అభివృద్ధి
►4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం అలయం వరకు రూ. 21 కోట్లు
►తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టిబీవార్డు నిర్మాణానికి ఆమోదం
►స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనానికి 3.35 లక్షలతో కేటాయింపు
►స్వీమ్స్ వైద్య సదుపాయాలు పెంపునకు కార్డియోకు నూతన భవనం
►స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు 197 కోట్లు కేటాయింపు
►తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో 3.50 లక్షలతో నూతన కెమారాలు, బోన్లు కొనుగోలుకు నిర్ణయం
►కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం
►సాంప్రదాయ కళల అభివృద్ధికి టీటీడీ ప్రాథమిక శిక్షణ.. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వనున్న టీటీడీ