142
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్‌మనిపించింది. 2005 తర్వాత భానుడి నుంచి వెలువడిన అత్యంత శక్తిమంతమైన ఎక్స్‌రే జ్వాల ఇదే. తీవ్రస్థాయి సౌర తుపాన్లు భూమిపై విరుచుకుపడి, ఆకాశంలో దేదీప్యమాన అరోరాలను సృష్టించిన కొద్దిరోజులకే ఈ పరిణామం జరిగింది. అయితే ఈసారి వెలువడ్డ సౌర జ్వాల పుడమిని తాకే అవకాశంలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అది వేరే దిశలోకి దూసుకెళుతుందని చెప్పారు. 11 ఏళ్ల నిడివి ఉండే సౌర కాలచక్రం ప్రస్తుతం గరిష్ఠ స్థాయికి చేరువవుతోంది. దీనివల్ల సూర్యుడిలో చర్యలు తీవ్రమవుతాయి. తరచూ సౌర జ్వాలలు, తుపాన్లు వెలువడుతుంటాయి.