News

చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం

127views

చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చార్ ధామ్ యాత్ర కోసం భక్తులు గంగోత్రి మరియు యమునోత్రికి పోటెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో పాల్గొనేందుకు అనుమతించబోమని సీనియర్ పోలీసు అధికారి అర్పన్ యదువంశీ వెల్లడించారు.

యాత్ర మార్గంలో పోలీసు బృందాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తాయని, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయాణించే వాహనాలను లోనికి అనుమతించబోమని తెలిపారు. అంతేకాకుండా చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు కేదర్నాథ్ ఆలయం వద్ద మొబైల్స్ ఫోన్స్ నిషేధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆలయానికి 200కిలో మీటర్ల దూరం వరకు మాత్రమే మొబైల్స్ తీసుకు వెళ్లవచ్చునన్నారు. యాత్రకు సంబంధించిన తప్పుదోవ పట్టించే వీడియోలు లేదా రీల్స్‌ను అప్‌లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా చార్ ధామ్ యాత్ర – -మే 10న ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైంది.