News

వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

5.8kviews

తిరుపతిలోని గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరస్వామికి సోదరుడిగా భావించే గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ఉదయం గోవిందరాజస్వామి ఆలయంలో మిథున లగ్నంలో గరుడ పటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణ ఘట్టం జరిగింది. అంతకు ముందు ధ్వజస్తంభానికి సుగంధ పరిమళ ద్రవ్యలతో అభిషేకాలను నిర్వహించి ధ్వజపటానికి నివేదన, మహా మంగళ హారతులు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి . ఈరోజు సాయంత్రం పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ఉదయం ఒక వాహనం సాయంత్రం మరో వాహనంపై స్వామి వారు ఊరేగనున్నారు.