News

రామ మందిర ప్రారంభోత్సవానికి 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం: వీహెచ్‌పీ

272views

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని 10 కోట్లకుపైగా కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) వెల్లడించింది. జనవరి 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పర్యటించి, ఈ మేరకు ఆహ్వానిస్తామని వీహెచ్‌పీ సెంట్రల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు.