
236views
కార్తీక మాసంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్ రాంబాబు, ఈవో రామారావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా మల్లేశ్వరాలయ పునఃప్రారంభం జరుగుతుందన్నారు. ఈ నెల 14 నుంచి కార్తిక మాసం ప్రారంభం కానుండటంతో భక్తులకు మల్లేశ్వరాలయాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు 19న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.





