
260views
వాల్తేర్ డివిజన్ పరిధి కంటకాపల్లిలో లైన్ లో రైలు ప్రమాదం తర్వాత మళ్లీ పలాస, రాయగడకు రైలు సర్వీసులను పునరుద్ధరించారు. నవంబర్ ఒకటో తేదీన విశాఖపట్నం-రాయగడ రైలును మొదలుపెట్టగా , విశాఖపట్నం-పలాస ప్యాసింజర్‌ను నవంబర్ 2 నుంచి పునఃప్రారంభించారు. డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీ సౌరభ్ ప్రసాద్ అందుబాటులో ఉన్న స్టాక్‌తో రైళ్లను నడపడానికి చొరవ తీసుకున్నారు. ఇదిలా వుండగా రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ రెండో రోజుకూడా చేపట్టారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, మృతుల ఆత్మకు శాంతి కలగాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.





