
424views
గణపతి పూజ వైభవంగా జరిగే ముంబైలో జీఎస్ బీ సేవా మండల్ అనే సంఘం గణేష్ ఉత్సవాలకు రూ.360 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది.అదే సంఘం గతేడాది రూ.316 కోట్లు, 2016లో రూ.300 కోట్ల చొప్పున ఇన్సూరెన్స్ తీసుకోవడం గమనార్హం. అంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవడం అనే సందేహం మీకు రావచ్చు. ఇక్కడ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా స్వామికి 70 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. 295 కిలోల వెండి, తదితర లోహాలతో చేసినవీ పూజలో వినియోగిస్తారు. బీమా బంగారం, వెండి, తదితర ఆభరణాలతో సహా వివిధ రకాల రిస్క్‌లను కవర్ చేస్తుందని… బంగారం, వెండి తదితర అభరణాలతో పాటు వాలంటీర్లు, పూజారులు, వంట వారు, పాదరక్షల నిర్వాహకులు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రమాద బీమా కోసం ఏటా ఇలా చేస్తున్నామని వెల్లడించారు.





