
293views
మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన జగద్గురు ఆదిశంకరాచార్య ఐక్యత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించిన విగ్రహం దేశంలోనే అతిపెద్ద ఆదిశంకరాచార్య విగ్రహం, ఈ విగ్రహాన్ని 12 ఏళ్ల బాలుని రూపంలో నిర్మించారు.ఈ విగ్రహాన్నిఆవిష్కరించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల విగ్రహం యావత్ భారతదేశానికి ప్రపంచానికి ఏకతా సందేశాన్ని ఇస్తుందన్నారు. రాముడు భారతదేశాన్ని ఉత్తరం నుండి దక్షిణానికి, కృష్ణుడు భారతదేశాన్ని తూర్పు నుండి పడమరకు అనుసంధానించగా… ఆదిశంకరాచార్యులు భారతదేశాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం అన్ని వైపుల నుండి అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి అనుసందానించారని పేర్కొన్నారు.





