123
పాకిస్థాన్ ఏజెంట్లకు దేశ రహస్య సమాచారం అందించిన ఓ డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ను పూణెలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 1923 ప్రకారం గూఢచర్యం కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ సందేశాల ద్వారా, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సున్నిత, రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.