News

సుంకులాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం

165views

కర్నూలు జిల్లాలోని గూడూరు మండలంలోని కె.నాగలాపురం గ్రామంలో గురు వారం సుంకులాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఈసందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అభిషేకం, మంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి దినేష్‌ ఆధ్వర్యంలో అమ్మవారి రథోత్సవం నిర్వహించగా ఉమ్మడి జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలకరించారు.