News

వేడుకగా పక్కీరప్ప స్వామి రథోత్సవం

163views

కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారంలో పక్కీరప్ప స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం ఉదయం మూలవిరాట్‌ పక్కీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నుంచి పక్కీరప్ప స్వామిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకు వచ్చి రథంపై అధిష్టించారు. అనంతరం రథాన్ని భక్తులు ముందుకు లాగారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. రాత్రి దేవాలయంలో భజన కార్యక్రమాలు, సంస్కాృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

వైభవంగా పోతులింగేశ్వర స్వామి రథోత్సవం
గజ్జెహళ్లి గ్రామంలో పోతులింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలూరు టీడీపీ ఇనచార్జి కోట్ల సుజాతమ్మ, ఆలూరు టీడీపీ మాజీ ఇనచార్జి వీరభద్రగౌడ్‌ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పూజారి శీను, పోతురాజు రామలింగ పాల్గొన్నారు. ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.