
160views
కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు గురువారం పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వేకువజామునే ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.




