
496views
కర్నూల్ జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి విలువైన వెండి సింహాసనాన్ని కర్ణాటకలోని వరణాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ ధర్మాధికారి డా. భీమేశ్వర జోషి విరాళంగా ఇచ్చారు. అదే విధంగా వెండితో తయారు చేసి బంగారు పూత, రత్నాలతో పొదిగిన స్వర్ణ కిరీటాన్ని పీఠాధిపతికి బహూకరించారు. మంగళవారం కుటుంబ సమేతంగా భీమేశ్వర జోషి మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊంజల మండపంలో విరాళంగా ఇచ్చిన వెండి సింహాసనంపై పీఠాధిపతిని కూర్చోబెట్టి బంగారు పూత పూసిన కిరీటాన్ని పీఠాధిపతి తలపై పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు యాగశాలలో హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతాచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.





