
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు పట్టణంలో వీరమ్మ తల్లి తిరుణాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు ఎంతో మహిమ, శక్తిమంతురాలుగా భక్తులు కొలుస్తుంటారు. తొలుత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను ప్రారంభించారు. 15 రోజులపాటు నిర్వహించనున్న ఈ తిరునాళ్లు ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం ఉయ్యాల మహోత్సవం. ఫిబ్రవరి 10న సిడి బండి మహోత్సవం నిర్వహించనున్నారు. 14వ తేదీతో తిరునాళ్ల ముగియనున్నాయి. జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తిరునాళ్లు జరిగే ప్రాంతం అంతటా సీసీటీవీ కెమెరాల నిఘా పరిధిలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు టౌన్ ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు.





