
319views
ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి నూతన రథం మహాసంప్రోక్షణ మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 5.25 గంటలకు మహాపూర్ణాహుతి, కుంభసమర్పణ కార్యక్రమం చేపట్టారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, పరషత్ ప్రాయశ్చిత్తం, రుత్విక్‌వరుణ, మండపారాధన, వాస్తు, బ్రహ్మ, రుద్ర మండపారాధన, రథ కలశానికిపంచశయ్యాధివాసాలు, వాస్తుహోమం, రుద్రహోమం అర్చకులు, వైదిక బృందం వేదమంత్రాలతో ఘనంగా జరిపించారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు, ఈవో పి.టి.విసత్యనారాయణ దంపతులు, రథం నిర్మాణకర్త గణపతి ఆచారి దంపతులతో పూజాధికాలు జరిపించారు.





