
362views
రాష్ట్రపతి భవన్‌లోని ఉద్యాన వనాల సందర్శనకు ప్రజలను అనుమతించే ‘ఉద్యాన్ ఉత్సవ్-2023’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రారంభించారు. ఈ ఉత్సవానికి మంగళవారం నుంచి ప్రజల్ని అనుమతించనున్నారు. ఈ ఉద్యానాలను ఇప్పటి వరకు మొఘల్ గార్డెన్స్‌గా వ్యవహరించారు. శనివారం వీటి పేరును ‘అమృత్ ఉద్యాన్’గా మార్చారు. వీటి సందర్శనకు ఏడాదికోసారి ప్రజలకు అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. ఈసారి ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అమృత్ ఉద్యాన్‌ను సందర్శించవచ్చు. మార్చి 28 నుంచి 31 వరకు ప్రత్యేక కేటగిరీలకు అవకాశం కల్పించారు.





