News

ఊటీ రైలును అద్దెకు తీసుకుంటున్న విదేశీయులు

330views

ఊటీలోని లోయల అందాలను చూపిస్తూ.. కొండలపై నడిచే Hill train ను రూ.3.60 లక్షలకు అద్దెకు తీసుకుని 16 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణించారు. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీకి నడిచే ఈ రైలు ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈక్రమంలో రైలును అద్దెకిచ్చి ఆదాయం పెంచుకొనేలా దక్షిణ రైల్వే చర్యలు ప్రారంభించింది. ఊటీకి వచ్చే విదేశీ పర్యాటకులు హిల్‌ ట్రైన్‌ను అద్దెకు తీసుకొని ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన 16 మంది పర్యాటకులు రూ.3,60,675 చెల్లించి ఈ రైలును అద్దెకు తీసుకొని ఊటీ లోయలను తనివితీరా చూసి.. ఎంజాయ్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.