News

ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్‌!

357views

ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము ఆర్‌డీఎక్స్‌ బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించబోతున్నాం. ఎవరి ఇళ్లలో వారు ఉంటే సురక్షితంగా ఉంటారు. లేదంటే మీకే ప్రమాదం. ఆ రోజు ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేసిన వారికి రూ.4 కోట్ల బహుమతి ఇస్తాం.’’ అంటూ ఆ సంస్థ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ సామాజిక మాధ్యమాలలో ఒక వీడియోను విడుదల చే శాడు. దీనిపై వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో 2009లో న్యాయవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ ఏర్పాటు చేసిన ఎస్‌ఎఫ్‌జే సంస్థ పంజాబ్‌ను భారత్‌ నుంచి వేరుచేసి ప్రత్యేక దేశం (ఖలిస్థాన్‌)గా ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో మొదటిసారిగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన గరుడ ప్రత్యేక బలగాలు కర్తవ్య పథ్‌లో కవాతు నిర్వహించనున్నాయి.