
346views
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కానుకల రూపంలో రూ.1,05,91,508లు లభించినట్లు ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆస్థాన మండపంలో గురువారం స్వామి హుండీ కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 25 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి, 2,249 యూఎస్‌ఏ, 150 ఆస్ట్రేలియా, 70 కెనడా డాలర్లు, 110 యూఏఈ దిర్హామ్స్, 10 యూరోలు కానుకల రూపంలో లభించాయి. ఈ ఆదాయం జనవరి 4 నుంచి 19వ తేదీ వరకు చేకూరిందని ఆలయ ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ.కృష్ణారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఉమేష్, యూనియన్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.





