
285views
సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రథసప్తమి జరగనుంది. ఈ సందర్బంగా ఏడు వాహనాలపై స్వామి వారు ఆలయ మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పర్వదినం సందర్బంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
వాహన సేవల వివరాలు ఇలా..
సూర్యప్రభ వాహనం: ఉ.5.30-8 వరకు
చిన్నశేష వాహనం: ఉ. 9-10
గరుడ వాహనం: ఉ. 11-మ. 12
హనుమంత వాహనం: మ. 1- 2
చక్రస్నానం: మ. 2-3
కల్పవృక్ష వాహనం: సా. 4-5
సర్వభూపాల వాహనం: సా.6-7
చంద్రప్రభ వాహనం: రా.8-9





