News

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

297views

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,229 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నటి రోజు రూ.3.47 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 31,381 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.