News

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 26వ జాతీయ యువజనోత్స వేడుకలు ప్రారంభం

365views

కర్నాటకలోని హుబ్బళ్ళిలో 26వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. స్వామి వివేకానంద ఆదర్శాలు, బోధనలను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే ‘జాతీయ యువజన దినోత్సవం’ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ప్రతిభావంతులైన దేశ యువత దేశ నిర్మాణం దిశగా పాటుపడేటట్లు వారిని ఉత్సాహవంతులను చేయడం కోసం ఏటా ఈ యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఒకే వేదిక మీదకు ఈ కార్యక్రమం తీసుకురావడమే కాకుండా ఈ ఉత్సవంలో పాలుపంచుకొనే వారిని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనతో పెనవేస్తోంది. ఈ సంవత్సరంలో, ఈ ఉత్సవాన్ని జనవరి 12 నుండి 16 వరకు కర్నాటక లోని హుబ్బళ్ళి-ధార్వాడలలో నిర్వహిస్తున్నారు. ‘వికసిత్ యువా, వికసిత్ భారత్’ అనేది ఈ ఉత్సవానికి ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా యువజన శిఖర సమ్మేళనం కొలువుదీరుతుంది. 60 మందికి పైగా నిపుణులు ఈ సమ్మేళనంలో పాలుపంచుకోనున్నారు.